Chandrababu: ఢిల్లీ నుంచి టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

Chandrababu held teleconference from Delhi
  • ఏపీలో జట్టు కట్టిన మూడు పార్టీలు
  • టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఖరారు
  • కాసేపట్లో ఉమ్మడి ప్రకటన వస్తుందన్న చంద్రబాబు
  • పరిస్థితులు అర్థం చేసుకోవాలని టీడీపీ నేతలకు సూచన
బీజేపీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ నుంచి పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీతో పొత్తు ఖరారైందని పార్టీ నేతలకు చెప్పారు. కాసేపట్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నుంచి ఉమ్మడి ప్రకటన వస్తుందని తెలిపారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాల్సిన ఆవశ్యకతను చంద్రబాబు తమ పార్టీ నేతలకు వివరించారు. రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకోవాలని నేతలకు సూచించారు. 

బీజేపీతో  సీట్ల  పంపకంపై ఓ అవగాహనకు వచ్చామని, మరో సమావేశం తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని చంద్రబాబు వివరించారు. మూడు పార్టీల మధ్య పొత్తుపై ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, కేంద్రం సహకారం అవసరమని, పొత్తుకు ఇదే కారణమని వెల్లడించారు.

ప్రస్తుతం చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీలోనే ఉన్నారు. వారిరువురు మరోసారి బీజేపీ అగ్రనేతలతో సమావేశమై సీట్ల పంపకంపై చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Chandrababu
Alliance
TDP
Janasena
BJP
Andhra Pradesh

More Telugu News