Telangana: తెలంగాణలో స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

Representatives of Tata Technologies met CM Revanth Reddy at the Secretariat
  • 65 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ఒప్పందం
  • 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులను నిర్వహించనున్న టాటా టెక్నాలజీస్
  • నైపుణ్యాలు పెంచేలా బ్రిడ్జి కోర్సుల నిర్వహణ 
  • ఎంవోయూపై సంతకాలు చేసిన టాటా, ప్రభుత్వ ప్రతినిధులు
తెలంగాణలో స్కిల్ కేంద్రాల ఏర్పాటుపై టాటా టెక్నాలజీస్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి ఎంవోయూపై టాటా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు సంతకాలు చేశారు. సచివాలయంలో శనివారం టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని 65 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల (స్కిల్లింగ్ సెంటర్లు) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో టాటా టెక్నాలజీస్ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయనుంది. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కొత్త ప్రాజెక్టును చేపడుతోంది. 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులను నిర్వహించనుంది. అలాగే నైపుణ్యాలు పెంచేలా బ్రిడ్జి కోర్సులు నిర్వహించనుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రాజెక్టు అమలు కానుంది.
Telangana
tata technologies
Revanth Reddy

More Telugu News