Gorantla Butchaiah Chowdary: అయ్యా చెల్లుబోయిన గారు... మీ మాటలు రూరల్ లో చెల్లు బాటు కావు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Gorantla Butchaiah Chowdary targets minister Chelluboina in Rajahmundry rural
  • గత ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి గెలిచిన చెల్లుబోయిన
  • ఈసారి ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ
  • పనికిమాలిన శిలాఫలకాలు ఎందుకు మంత్రి గారూ అంటూ గోరంట్ల ధ్వజం
  • చెత్త మంత్రిగా మిగిలిపోతావు అంటూ విమర్శలు  

టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై ధ్వజమెత్తారు. చెత్త మంత్రి గారూ... శిలాఫలకాలైతే వేశారు కానీ పనులు ఎప్పుడు చేస్తారు? అని నిలదీశారు. పనికిమాలిన శిలాఫలకాలు ఎందుకు మంత్రి గారూ? ఎన్నికల ముందు డ్రామాలు ఆడతారా? అని మండిపడ్డారు. 

"నెల రోజులుగా ధవళేశ్వరం చుట్టూ తిరుగుతున్నావు... వాగ్దానాల మీద వాగ్దానాలు చేస్తున్నావు... ఒక్కటైనా అమలైందా? కనీసం చెత్త కూడా తీయించలేని నువ్వు చెత్త మంత్రిగా మిగిలిపోతావు" అంటూ ఘాటుగా విమర్శించారు. 

"అయ్యా చెల్లుబోయిన గారూ... మీ మాటలు రూరల్ లో చెల్లుబాటు కావు... మీకు ప్రజలు చెల్లు చీటి ఇస్తారు. స్వచ్ఛత పరిశుభ్రత మన బాధ్యత అని చెప్పే మీకు ధవళేశ్వరంలో పేరుకుపోయిన చెత్త కనిపించడంలేదా? ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి కల్లబొల్లి కబుర్లు చెబుతూ శిలాఫలకాలు వేయడం హాస్యాస్పదంగా ఉంది" అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. 

ఈసారి ఎన్నికల్లో అభ్యర్థులను మార్చుతున్న వైసీపీ అగ్రనాయకత్వం... మంత్రి చెల్లుబోయినను రాజమండ్రి రూరల్ ఇన్చార్జిగా బదిలీ చేయడం తెలిసిందే. మంత్రి చెల్లుబోయిన గత ఎన్నికల్లో కోనసీమ జిల్లా రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

  • Loading...

More Telugu News