G. Kishan Reddy: అభ్యర్థుల ఎంపికపై చర్చ... కిషన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు

Kishan Reddy will go New Delhi today
  • ఇప్పటికే తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
  • మిగతా 8 స్థానాల్లో ఎంపికపై కిషన్ రెడ్డితో చర్చించే అవకాశం
  • రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఖరారు

కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ కొన్ని రోజుల్లో రానుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే 195 లోక్ సభ అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ప్రకటించింది.

17 లోక్ సభ స్థానాలకు గాను మరో ఎనిమిది చోట్ల అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు అధిష్ఠానం కిషన్ రెడ్డిని ఢిల్లీకి రావాలని పిలిచింది. దీంతో ఈ రోజు ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఇదే సమయంలో పార్టీలో చేరికలపై కూడా చర్చించనున్నారు. రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. మిగతా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముంది.

  • Loading...

More Telugu News