Ponnam Prabhakar: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

Telangana government good news for rtc employees
  • ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
  • జూన్ 1వ తేదీ నుంచి కొత్త ఫిట్‌మెంట్ అమలవుతుందని వెల్లడి
  • కొత్త పీఆర్సీతో ఆర్టీసీపై ఏడాదికి రూ.418 కోట్లకు పైగా అదనపు భారం పడనుందని వెల్లడి
ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆయన శనివారం బస్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... జూన్ 1వ తేదీ నుంచి కొత్త ఫిట్‌మెంట్ అమలవుతుందని వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నట్లు తెలిపారు. 2017లో నాటి ప్రభుత్వం 16 శాతం పీఆర్సీ ఇచ్చిందని... మళ్లీ ఇవ్వలేదని గుర్తు చేశారు. అందుకే ఈసారి 21 శాతం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

కొత్త పీఆర్సీతో ఆర్టీసీపై నెలకు రూ.35 కోట్లు... ఏడాదికి రూ.418 కోట్లకు పైగా అదనపు భారం పడుతుందన్నారు. ఈ నిర్ణయంతో తెలంగాణ ఆర్టీసీలోని 53 వేలకు పైగా ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. పొన్నం ఇంకా మాట్లాడుతూ... తమ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహాలక్మి పథకం అమలు చేశామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ పథకం విజయవంతంగా సాగుతోందన్నారు.
Ponnam Prabhakar
Telangana
Congress

More Telugu News