Bhairava: 'కల్కి' చిత్రంలో ప్రభాస్ పాత్ర పేరును వెల్లడిస్తూ పోస్టర్ విడుదల చేసిన చిత్రబృందం

Prabhas name in  Kalki 2898AD unveiled
  • ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ
  • వైజయంతీ మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న చిత్రం
  • కీలక పాత్రలు పోషిస్తున్న కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్
  • ప్రభాస్ సరసన దీపికా పదుకొణే, దిశా పటానీ
  • ఇందులో ప్రభాస్ పాత్ర పేరు 'భైరవ' 

అగ్రహీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ కల్కి 2898 ఏడీ. హాలీవుడ్ రేంజిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజాలు కూడా నటిస్తుండడంతో భారీ హైప్ నెలకొంది. ఇందులో ప్రభాస్ సరసన దీపికా పదుకొణే, దిశా పటానీ వంటి బాలీవుడ్ ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. 

కాగా, ఈ చిత్రం నుంచి నేడు అదిరిపోయే అప్ డేట్ వెలువడింది. ఇందులో ప్రభాస్ పాత్ర పేరును చిత్రబృందం విడుదల చేసింది. కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్ పాత్ర పేరు 'భైరవ'. భవిష్యత్ కాశీ నగరం వీధుల్లో 'భైరవ'ను పరిచయం చేస్తున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్టర్ పంచుకున్నారు. 

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News