Komatireddy Venkat Reddy: త్వరలో మహిళలకు వడ్డీలేని రుణాలు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy promises to interest free loans to women
  • పానగల్ చారిత్రాత్మక పచ్చల ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి
  • ఆలయాల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని హామీ
  • మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని వెల్లడి

త్వరలో మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన నల్గొండ పట్టణంలోని పానగల్ చారిత్రాత్మక పచ్చల ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఇక్కడ ఉన్న ఆలయాలకు ఎంతో ప్రత్యేకత ఉందని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. త్వరలో వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు.

  • Loading...

More Telugu News