Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి స్వల్ప అస్వస్థత

  • మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రికి తరలింపు
  • యాంజియోగ్రామ్ చేసిన డాక్టర్లు
  • గుండెనరాల్లో బ్లాక్స్ ఉన్నట్లుగా గుర్తింపు
  • ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు స్వల్ప అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్లు ఆయనకు యాంజియోగ్రామ్ చేశారు. గుండెనరాల్లో బ్లాక్స్ ఉన్నట్లుగా గుర్తించారు. వైద్యం చేసి గుండెకు స్టంట్ వేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రేవంత్ రెడ్డి మరో తమ్ముడు కొండల్ రెడ్డి మెడికవర్ ఆసుపత్రికి వచ్చి సోదరుడి వద్ద ఉన్నారు.
Revanth Reddy
brother
Telangana
Hyderabad

More Telugu News