Kadiam Srihari: కాంగ్రెస్ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చింది: కడియం శ్రీహరి

Kadiyam Srihari blames congress for false promises
  • కాంగ్రెస్ పార్టీ మోసానికి పెట్టింది పేరు అని విమర్శ
  • అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని డిమాండ్
  • కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా మోసాల పుట్ట అని ఆరోపణ
కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఆ పార్టీ మోసానికి పెట్టింది పేరు అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఇళ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా మోసాల పుట్ట అని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజల తరఫున పోరాడుతామన్నారు.
Kadiam Srihari
BRS
Telangana

More Telugu News