Geetu Rayal: ప్రేమలో ఉన్న వారికి బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ సలహా

Bigg Boss fame Geetu Royal suggestion to Lovers
  • బిగ్ బాస్ సీజన్ 8లో ప్రేక్షకులను ఆకట్టుకున్న గీతూ
  • అసలైన ప్రేమ అనేది తెలియాలంటే 6 నెలలు ఆగాలని సూచన
  • అప్పటి వరకు ఉండోది వ్యామోహమని వ్యాఖ్య

బిగ్ బాస్ సీజన్ 8లో గీతూ రాయల్ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. 9వ వారంలో ఆమె ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లే సమయంలో గీతూ కన్నీరుపెట్టుకుంది. ఆమెకు హౌస్ లోకి రీఎంట్రీ ఉంటుందని చాలా మంది భావించినప్పటికీ... ఆమెకు ఆ అవకాశం దక్కలేదు. ఆ తర్వాత సీజన్ 7 కంటెస్టెంట్స్ ని గీతూ రాయల్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా ఆమె వ్యవహరించింది. 

తాజాగా నెటిజెన్స్ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెపుతూ... ప్రేమలో ఉన్న వారికి సలహాలు ఇచ్చింది. నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలియాలంటే కనీసం 6 నెలలు వేచి చూడాలని తెలిపింది. అప్పటి వరకు ఉండేది వ్యామోహం మాత్రమేనని... అన్నీ అయిపోయాక బోర్ కోట్టేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసింది. 6 నెలల తర్వాత కూడా మొదట్లో ఉన్నట్టు గానే ప్రేమ ఉంటే అది నిజమైన ప్రేమ అనుకోవచ్చని చెప్పింది. మరోవైపు, 2021లో వికాస్ అనే వ్యక్తిని గీతూ రాయల్ పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ ఒకే ఊరిలో పెరిగారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

  • Loading...

More Telugu News