Beeda Ravichandra: వైసీపీ పాలనలో బీసీలను బానిసలుగా చూశారు: బీద రవిచంద్ర

YSRCP treated BCs like slaves says Beeda Ravichandra
  • బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలకు భరోసా కల్పించామన్న రవిచంద్ర
  • వైసీపీ ప్రభుత్వం బీసీ భవనాలు నిర్మించలేదని విమర్శ
  • బీసీలు టీడీపీ వెంటే ఉన్నారని వ్యాఖ్య
బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలకు తెలుగుదేశం పార్టీ భరోసా కల్పించిందని టీడీపీ నేత బీద రవిచంద్ర అన్నారు. బీసీలలో భరోసా నింపిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ పాలలో బీసీలను బానిసలుగా చూశారని మండిపడ్డారు. బీసీ భవనాలు నిర్మిస్తామని చెప్పారని... బలహీనవర్గాల కోసమే టీడీపీ పుట్టిందని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లను కల్పించింది టీడీపీనే అని తెలిపారు. బీసీలు టీడీపీ వెంటే ఉంటారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి బీసీలు బుద్ధి చెపుతారని అన్నారు.

Beeda Ravichandra
Telugudesam
YSRCP
Janasena

More Telugu News