Telangana: ఎమ్మెల్సీల నియామ‌కం చెల్లదు.. తెలంగాణ హైకోర్టు కీల‌క తీర్పు

High Court key Verdict on Governor Quota MLCs in Telangana
  • ఎమ్మెల్సీలుగా కోదండ‌రామ్, అమీర్ అలీఖాన్‌ల నియామ‌కం చెల్ల‌ద‌న్న న్యాయ‌స్థానం
  • ఇటీవ‌ల ప్ర‌భుత్వం జారీ చేసిన‌ గెజిట్‌ కొట్టివేత‌
  • రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి చుక్కెదురు
గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల నియామ‌కంపై హైకోర్టు కీల‌క తీర్పునిచ్చింది. కోదండ‌రామ్, అమీర్ అలీఖాన్‌ల‌ను నియ‌మిస్తూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇటీవ‌ల జారీ చేసిన‌ గెజిట్‌ను కొట్టిపారేసింది. కొత్త‌గా ఎమ్మెల్సీల నియామ‌కం చేప‌ట్టాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించింది. ఎమ్మెల్సీల నియామ‌కంపై ప్ర‌భుత్వం మరోసారి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని గవర్నర్ కు పంపించాలని ఆదేశించింది.  మంత్రి మండ‌లి నిర్ణ‌యానికి గ‌వ‌ర్న‌ర్ క‌ట్టుబ‌డి ఉండాల‌ని సూచించింది. 
Telangana
MLC
High Court

More Telugu News