Jacqueline Fernandez: బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్ర‌మాదం

Jacqueline Fernandez 17 Storey Building in Mumbai Catches Fire
  • గ‌త‌రాత్రి 8 గంట‌లకు అపార్ట్‌మెంట్‌లోని 14వ అంత‌స్తులో మంట‌లు
  • 15వ అంత‌స్తులో ఉండ‌టంతో జాక్వెలిన్ సుర‌క్షితం
  • ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని పోలీసుల వెల్ల‌డి
బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో బుధ‌వారం రాత్రి భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ముంబైలోని బాంద్రావెస్ట్ ప‌రిధిలోని న‌ర్గీస్ ద‌త్ రోడ్‌లో ఉండే నౌరోజ్ హిల్ సొసైటీలో 17 అంత‌స్తులు ఉండే భ‌వ‌నంలో జాక్వెలిన్ నివాసం ఉంటున్నారు. గ‌త‌రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో ఈ అపార్ట్‌మెంట్‌లోని 14వ అంత‌స్తులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దాంతో అపార్ట్‌మెంట్ వాళ్లు పోలీసులు, అగ్నిమాప‌క‌శాఖ వారికి స‌మాచారం అందించారు. వారి స‌మాచారంతో వెంట‌నే పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది నాలుగు ఫైరింజ‌న్ల‌తో ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. ఫైరింజిన్లతో మంట‌ల‌ను అదుపు చేశారు. ఇక జాక్వెలిన్ 15వ అంత‌స్తులో ఉండ‌టంతో ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని తెలిసింది. అలాగే ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని పోలీసులు వెల్ల‌డించారు.
Jacqueline Fernandez
Mumbai
Bollywood
Fire Accident

More Telugu News