పేదలకు ఇళ్లు కట్టించిన ప్రధాని మోదీకి సొంతిల్లే లేదు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
- దేశ ప్రజలే మోదీ కుటుంబ సభ్యులన్న బీజేపీ నేత
- అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత మోదీదే అని వ్యాఖ్య
- మాజీ సీఎం కేసీఆర్.. కొడుకునో, కూతురునో సీఎంగా చేయడానికి పని చేస్తున్నారని విమర్శ
200 యూనిట్ల విద్యుత్ బిల్లు ఉచితంపై మాట తప్పారన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా రైతు భరోసా కింద రూ.15వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ హామీలు ఉంటాయనే నమ్మకం లేదన్నారు. రైతు భరోసా డిసెంబర్‌లోనే ఇవ్వాల్సిందని... కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోక్ సభ ఎన్నికల్లో కలిసే పని చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. గడీలు బద్దలు కొట్టాలని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు... ఇప్పుడు అదే గడీల్లో తల దాచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ నెల 12న తెలంగాణకు కేంద్రమంత్రి అమిత్ షా వస్తున్నారని... పోలింగ్ బూత్‌స్థాయి నేతల సమావేశంలో పాల్గొంటారని చెప్పారు.