Ananya Nagalla: ఈ సినిమాలో నేను భయపడతాను.. ఆడియన్స్ ని సినిమా భయపెడుతుంది: అనన్య నాగళ్ల

Ananya Nagalla Interview
  • తెలుగు బ్యూటీగా అనన్య నాగళ్ల 
  • 'వకీల్ సాబ్' సినిమాతో మంచి గుర్తింపు 
  • నాయిక ప్రధానంగా చేసిన 'తంత్ర'
  • సమంత అంటే ఇష్టమన్న అనన్య

తెలుగు అమ్మాయిగా .. తెలుగు తెరపై ప్రయాణం చేస్తున్న కథానాయికలలో అనన్య నాగళ్ల ఒకరు. యూత్ లో ఆమెకి మంచి క్రేజ్ ఉంది. 'మల్లేశం' .. 'వకీల్ సాబ్' .. ' శాకుంతలం' సినిమాలు ఆమెకి మంచి పేరు పెట్టాయి. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'తంత్ర' సిద్ధమవుతోంది. క్షుద్ర శక్తుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, త్వరలో థియేటర్లకు రానుంది. 

తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనన్య మాట్లాడుతూ .. 'తంత్ర' సినిమా కథ వినగానే ఓకే చెప్పాను .. అంతగా నాకు నచ్చింది. ఒక రకంగా ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ అనే చెప్పాలి. ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగుంటుంది. ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది. ఈ సినిమాలో నేను భయపడతాను .. ఆడియన్స్ ను సినిమా భయపెడుతుంది" అని అంది. 

" తెలుగులో నాకు సమంత అంటే చాలా ఇష్టం. సమంత తన కెరియర్ గ్రాఫ్ ను పెంచుకుంటూ వెళ్లిన విధానం నాకు నచ్చుతుంది. ఆమె పాత్రల ఎంపిక కూడా నాకు నచ్చుతుంది. క్యూట్ గా కనిపిస్తూనే నటనకి ప్రాధాన్యత గల బలమైన పాత్రలను పోషించవచ్చని నాకు అర్థమైంది. అప్పటి నుంచి ఆ రూట్లోనే వెళుతున్నాను" అని చెప్పింది. 

  • Loading...

More Telugu News