Atchannaidu: అది సీఏం జ‌గ‌న్ ప‌గ‌టి క‌లే: అచ్చెన్నాయుడు

AP TDP President Atchannaidu Criticizes CM Jagan
  • విశాఖ నుంచి సీఏంగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తాన‌న్న జగన్ 
  • విశాఖ‌పై ఆయనకున్నది కపట ప్రేమేనన్న అచ్చెన్న   
  • జ‌గ‌న్ పాల‌న‌లో రూ.40 వేల కోట్ల భూదోపిడి జరిగిందని ఆరోపణ 
వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో గెలిచి విశాఖ నుంచి సీఏంగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తాన‌ని, ఇక్క‌డే ఉంటాన‌ని ముఖ్యమంత్రి జ‌గ‌న్ తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు వ్యంగ్యంగా స్పందించారు. అది సీఏం జ‌గ‌న్ ప‌గ‌టి క‌లేన‌ని ఎద్దేవా చేశారు. ఆయ‌న‌కు విశాఖ‌పై వున్నది క‌ప‌ట‌ప్రేమేన‌ని మండిప‌డ్డారు. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో ఏకంగా రూ.40వేల కోట్ల భూదోపిడీ జ‌రిగింద‌ని విమ‌ర్శించారు. ఇప్ప‌టికే రిషికొండ‌ ప‌రిధిలోని ఐటీ సెజ్ నుంచి 14 కంపెనీలు త‌రలిపోయాయని గుర్తు చేశారు. అంతేగాక జ‌గ‌న్ విధ్వంస పాల‌న‌లో రూ.లక్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వెళ్లిపోయాయ‌ని దుయ్య‌బ‌ట్టారు.
Atchannaidu
TDP
YS Jagan
YSRCP
AP Politics

More Telugu News