G. Kishan Reddy: ప్రధాని మోదీని పెద్దన్న అని ఎందుకు అన్నారో... రేవంత్ రెడ్డినే అడగండి: కిషన్ రెడ్డి వ్యాఖ్య

Kishan Reddy responds on revanth reddy big brother comments
  • పెద్దన్న అన్నంత మాత్రాన వారిద్దరు కలిసినట్లుగా భావించాలా? అని ప్రశ్న
  • విపక్షాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, అది ప్రభుత్వాలకు సంబంధించిన అంశమని వెల్లడి 
  • తెలంగాణలో మోదీ సభలు విజయవంతమయ్యాయన్న కిషన్ రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దన్న అని సంబోధించడం రాజకీయ చర్చకు దారి తీసిన అంశంపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మోదీని పెద్దన్న అని రేవంత్ రెడ్డి ఎందుకు అన్నారో... ఆయననే అడగాలని వ్యాఖ్యానించారు. అయినా పెద్దన్న అన్నంత మాత్రాన వారిద్దరూ ఒక్కటి అయినట్లుగా భావిస్తారా? అని చురక అంటించారు. పెద్దన్న అని రేవంత్ రెడ్డి అన్నందుకు విపక్షాలు విమర్శిస్తే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని... ఎందుకంటే అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశమన్నారు.

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ సభలు విజయవంతమయ్యాయన్నారు. రేపటి నుంచి బీజేపీ మేనిఫెస్టో కోసం సలహాలను, సూచనలను స్వీకరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలుపై స్పష్టత లేకుండా పోయిందని ఆరోపించారు. సగటు ప్రజల ఓట్లను కూడా తాము మోదీకి అనుకూలంగా కూడగట్టే విధంగా ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు.
G. Kishan Reddy
BJP
Revanth Reddy
Narendra Modi
Telangana

More Telugu News