Chandrababu: కాసేపట్లో చంద్రబాబు చివరి 'రా కదలిరా' సభ

Chandrababu final Ra Kadalira sabha today
  • పెనుకొండ నియోజకవర్గంలో జరగనున్న సభ
  • కియా పరిశ్రమ ఎదురుగా సభకు ఏర్పాట్లు
  • భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అడిషనల్ ఎస్పీ
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు 'రా కదలిరా' సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. కియా పరిశ్రమ ఎదురుగా ఉన్న స్థలంలో సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సభతో 'రా కదలిరా' సభలు ముగియనున్నారు. ఈ సభల ద్వారా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో చంద్రబాబు ప్రచారాన్ని నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 23 చోట్ల సభలు జరిగాయి. 

సభ నేపథ్యంలో అక్రడి భద్రతా ఏర్పాట్లను జిల్లా అడిషనల్ ఎస్పీ పరిశీలించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మతో చర్చించారు. ఈ సందర్భంగా పెనుకొండ డీఎస్పీ, సీఐ, ఎస్ఐ కూడా అక్కడ ఉన్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు కియా పరిశ్రమ కనిపించేలా వేదికను నిర్మించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో సభా వేదిక వద్దకు చంద్రబాబు చేరుకుంటారు.
Chandrababu
Telugudesam
Penukonda

More Telugu News