Kodali Nani: పవన్ ను జనసైనికులే రక్షించుకోవాలి: కొడాలి నాని

Kodali Nani says Janasena workers must save Pawan Kalyan
  • ఎన్నికల్లో పవన్ ను ఓడించేది టీడీపీయేనన్న కొడాలి నాని
  • పవన్ అభిమానులు అప్రమత్తం కావాలని సూచన
  • చంద్రబాబుకు ఓట్లు కావాలే తప్ప సీట్లు ఇవ్వరని విమర్శలు
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తాజా రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. పవన్ కల్యాణ్ ను ఓడించేది తెలుగుదేశం పార్టీయేనని, ఈ విషయం ఎన్నికల తర్వాత అందరికీ అర్థమవుతుందని అన్నారు. అభిమానులు అప్రమత్తం కావాలని, లేకపోతే పవన్ కల్యాణ్ తగిన మూల్యం చెల్లించుకుంటాడని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ను జనసైనికులే రక్షించుకోవాలని తెలిపారు. 

చంద్రబాబుకు ఓట్లు కావాలే తప్ప సీట్లు ఇవ్వరని కొడాలి నాని వ్యాఖ్యానించారు. మూడు శాతం ఓట్లు ఉన్న తన సామాజిక వర్గానికి చంద్రబాబు 30 సీట్లు ఇచ్చుకున్నాడని, 20 శాతం ఉన్న వర్గానికి మాత్రం 24 సీట్లే ఇచ్చాడని విమర్శించారు. 

జనసేనకు ఇచ్చిన ఆ 24 సీట్లలో 10 సీట్లు కచ్చితంగా ఓడిపోయే సీట్లేనని వివరించారు. అలాంటి సీట్లు ఇవ్వడానికి చంద్రబాబుకు సిగ్గుండాలని, తీసుకోవడానికి పవన్ కల్యాణ్ కైనా సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్లు అని, అలాంటివాళ్లను పవన్ పక్కనబెట్టుకుని తిరుగుతున్నారని పేర్కొన్నారు.
Kodali Nani
Pawan Kalyan
Janasena
TDP
Andhra Pradesh

More Telugu News