పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సమంత.. వీడియో ఇదిగో!
- పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు
- మొక్కులు చెల్లించుకుని, పూజలు చేసిన హీరోయిన్
- దివ్యాంగుడైన అభిమానితో సెల్ఫీ దిగిన సమంత
అనంతరం గుడిలో నుంచి బయటకు వచ్చిన సమంతను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. సెల్ఫీలు తీసుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ దివ్యాంగుడు సెల్ఫీ కోసం రాగా.. సమంత చిరునవ్వుతో పలకరించారు. అభిమానితో కలిసి సెల్ఫీ దిగారు. ఇటీవల అనారోగ్యం బారిన పడినట్లు వెల్లడించిన సమంత.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తున్నారు.