Lalu Prasad Yadav: మోదీ ఫేక్ హిందువు.. అందుకు ఇదే నిదర్శనం.. ఉదాహరణతో వివరించిన లాలూ ప్రసాద్

Modi Not A Real Hindu RJD Chief Lalu Comments
  • తల్లి హీరాబా మోదీ చనిపోయినప్పుడు మోదీ గుండుకొట్టించుకోలేదన్న లాలు యాదవ్
  • మోదీ నెప్టో నెపోటిజం వ్యాఖ్యలపైనా ఆర్జేడీ కామెంట్స్
  • పాట్నాలో నిర్వహించిన జన్ విశ్వాస్ మహా ర్యాలీలో వ్యాఖ్యలు
  • హాజరైన విపక్ష నేతలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ నిజమైన హిందువు కాదని పేర్కొన్న ఆయన అందుకు ఉదాహరణ కూడా చెప్పారు. ఆయన తల్లి హీరాబా మోదీ డిసెంబరు 2022లో చనిపోయినప్పుడు మోదీ గుండు కొట్టించుకోలేదని గుర్తు చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు చనిపోయినప్పుడు గుండు కొట్టించుకోవడం ఆచారమని పేర్కొన్నారు.

పాట్నాలోని గాంధీ మైదాన్‌లో నిర్వహించిన ‘జన్ విశ్వాస్ మహా ర్యాలీ’లో లాలూ యాదవ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సహా విపక్షాలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.

మోదీ చేసిన నెపోటిజం (బంధుప్రీతి) వ్యాఖ్యలపైనా లాలు గట్టిగా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని, ఎక్కువమంది పిల్లలు ఉన్నవారు ఆయన వ్యాఖ్యలతో అవమానానికి గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కిడ్నీ దానం చేసిన కుమార్తె రోహిణిని లాలూ ఈ సందర్భంగా ప్రశంసించారు.

  • Loading...

More Telugu News