KCR: కరీంనగర్ లో ఈ నెల 12న బీఆర్ఎస్ సభ... ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్

KCR will attend Karimnagar rally on Mar 12
  • కరీంనగర్, పెద్దపల్లి నేతలతో కేసీఆర్ సమీక్ష
  • కరీంనగర్ సభకు హాజరు కానున్న కేసీఆర్ 
  • రోడ్ షోలలో తాను కూడా పాల్గొంటానని కేసీఆర్ ప్రకటన
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ చీఫ్ కేసీఆర్ ఇవాళ హైదరాబాద్ తెలంగాణ భవన్ లో కరీంనగర్, పెద్దపల్లి నేతలతో సమావేశం అయ్యారు. ఈ నెల 12న కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభ ద్వారా లోక్ సభ ఎన్నికలకు సమరశంఖం పూరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. కాగా, లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బీజేపీ నుంచే పోటీ ఎదురవుతుందని అన్నారు. ఎన్నికల కోసం నిర్వహించే రోడ్ షోలలో తాను కూడా పాల్గొంటానని కేసీఆర్ ప్రకటించారు.  తద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రగిలించే ప్రయత్నం చేశారు. బస్సు యాత్రలు, మండల స్థాయి సమావేశాలతో ప్రజల్లోకి వెళదామని పిలుపునిచ్చారు.
KCR
Karimnagar
BRS
Lok Sabha Polls
Telangana

More Telugu News