Darling: పరిచయం లేని స్త్రీలను 'డార్లింగ్' అని పిలిస్తే అది లైంగిక వేధింపే: కలకత్తా హైకోర్టు

Calcutta High Court terms calling unknown woman as Darling will be harassment
  • ఆత్మీయులను డార్లింగ్ అని పిలవడం సాధారణ విషయం
  • కానీ, తెలియని వాళ్లను అలా పిలిస్తే అసభ్యత కిందికి వస్తుందన్న హైకోర్టు
  • సెక్షన్ 354ఏ, 509 కింద విచారించవచ్చునని వెల్లడి  

మనకు ఇష్టమైనవారిని డార్లింగ్ అని పిలవడం సాధారణమైన విషయం. అందులో తప్పేమీ ఉండదు. కానీ పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిస్తే మాత్రం కష్టాలు తప్పవండోయ్. కలకత్తా హైకోర్టు ఈ అంశంలో ఏమని తీర్పు ఇచ్చిందో ఓసారి చూడండి. 

అసలేం జరిగిందంటే... కోల్ కతాలో దుర్గాపూజ సందర్భంగా బందోబస్తు కోసం మహిళా పోలీసులను కూడా నియమించారు. అయితే, ఓ వ్యక్తి మహిళా కానిస్టేబుల్ ను డార్లింగ్ అని పిలిచాడు. దాంతో ఆ మహిళా పోలీసు సదరు వ్యక్తిపై మాయాబందర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, అతడిపై కేసు నమోదైంది. 

ఈ కేసు విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏ మాత్రం పరిచయం లేకుండానే ఓ మహిళను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపు కిందికి వస్తుందని స్పష్టం చేసింది. అలా పిలిచిన వారిని ఐపీసీ 354ఏ, 509 సెక్షన్ల కింది విచారించవచ్చునని హైకోర్టు పేర్కొంది. 

పరిచయం లేని మహిళ పట్ల డార్లింగ్ అనే పదాన్ని ఉపయోగించడం అసభ్యత కిందికి వస్తుందని కలకత్తా హైకోర్టు ధర్మాసనం వివరించింది.

  • Loading...

More Telugu News