Michigan Woman: ఏడేళ్ల క్రితం అదృశ్యమైన మిషిగన్ మహిళ.. ఏడుపు విని గుర్తించి రక్షించిన పోలీసులు

 Woman Missing For 7 Years Found After Police Hear Her Screaming
  • మిషిగన్‌లోని ఎవర్‌గ్రీన్ మోటెల్‌లో మహిళ ఏడుపు వినిపించడంతో పోలీసుల అనుమానం
  • ఆ దిశగా వెళ్లగా కనిపించిన గది
  • తలుపులు బద్దలుగొట్టి లోపలికి ప్రవేశం
  • ఏడుస్తూ కనిపించిన మహిళ, పక్కనే డ్రగ్స్, తుపాకి
ఏడేళ్ల క్రితం అదృశ్యమైన అమెరికాలోని మిషిగన్‌కు చెందిన మహిళను ఆమె అరుపుల ద్వారా గుర్తించి ఎట్టకేలకు రక్షించారు. అనంతరం విషయాన్ని ఆమె పెంపుడు తల్లిదండ్రులకు తెలియజేశారు. ఇంక్‌స్టర్‌లోని ఓ మోటెల్ (మోటార్ హోటల్) నుంచి ఆమెను రక్షించినట్టు తెలిపారు. 2017లో ఆమె అదృశ్యమైందని, ఎవర్‌గ్రీన్ మోటెల్‌ నుంచి ఆమెను రక్షించినట్టు పేర్కొన్నారు.  

తాము మోటెల్‌కు వెళ్లినప్పుడు ఓ చోటు నుంచి ఏడుపులాంటి శబ్దం సన్నగా వినిపించిందని, ఆ దిశగా వెళ్లగా ఓ గది కనిపించిందని మిషిగన్ పోలీసులు తెలిపారు. ఆ గదిని బలవంతంగా తెరిచి చూస్తే అందులో 30వ పడిలో ఉన్న ఓ మహిళ కనిపించిందని పేర్కొన్నారు. ఆమెపై భౌతికదాడి జరిగిన ఆనవాళ్లు లేవన్న పోలీసులు ఆమె చుట్టూ డ్రగ్స్, తుపాకి ఉన్నట్టు వివరించారు. వెంటనే ఆమెను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఆ తర్వాత ఆమెను కుటుంబానికి అప్పగిస్తారు. ఆమె అదృశ్యం వెనకున్న కారణాలు స్పష్టంగా తెలియరాకున్నప్పటికీ, ఆమె మానవ అక్రమ రవాణా ముఠా చేతికి చిక్కి ఉంటుందని డిటెక్టివ్‌లు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిపారు.
Michigan Woman
USA
Woman Screaming
Motel Room
Evergreen Motel

More Telugu News