WTC points table: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన టీమిండియా

India move to the top of WTC points table after Australia beat New Zealand
  • తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా గెలవడంతో పాయింట్ల పట్టికలో మారిన సమీకరణాలు
  • 65.58 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత్
  • 2, 3 స్థానాల్లో నిలిచిన కివీస్, ఆసీస్ జట్లు
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. వెల్లింగ్టన్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించడం భారత్‌కు కలిసొచ్చింది. ఆసీస్ గెలుపుతో కివీస్ ఖాతాలో ఉన్న డబ్ల్యూటీసీ పాయింట్లు 60కి తగ్గాయి. దీంతో 64.58 పాయింట్లతో ఉన్న భారత్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇక న్యూజిలాండ్‌పై గెలుపుతో ఆస్ట్రేలియా పాయింట్లు 55 నుంచి 59.09కి పెరిగినప్పటికీ ఆ జట్టు మూడవ స్థానానికే పరిమితమైంది. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే 5వ టెస్ట్ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా పాయింట్లు 68.51కి మెరుగవుతాయి. అలా జరిగితే అగ్రస్థానం మరింత పదిలమవుతుంది. ఇక క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగే రెండో టెస్టులో ఆసీస్‌పై న్యూజిలాండ్ గెలిచినా భారత్ అగ్రస్థానంలోనే ఉంటుంది.

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక
1. ఇండియా - 64.58 పాయింట్లు
2. న్యూజిలాండ్ - 60.00 పాయింట్లు
3. ఆస్ట్రేలియా- 59.09 పాయింట్లు
4. బంగ్లాదేశ్ - 50 పాయింట్లు
5. పాకిస్థాన్ - 36.66 పాయింట్లు
6. వెస్టిండీస్ - 33.33 పాయింట్లు

కాగా వెల్లింగ్‌టన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా విజయం 172 పరుగులతో తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కామెరాన్ గ్రీన్ అజేయంగా 174 పరుగులతో పాటు బౌలింగ్‌లో నాథన్ లియాన్ రాణించడంతో ఆసీస్ సునాయాసంగా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
WTC points table
India
Team New Zealand
Australia
Cricket
sports news

More Telugu News