Capgemini: క్యాప్ జెమినీలో భారీ రిక్రూట్‌మెంట్..సంస్థ కీలక ప్రకటన

  • రిక్రూట్‌మెంట్‌పై సంస్థ చీఫ్ టెక్నాలజీ, ఇన్నోవేటివ్ అధికారి కీలక వ్యాఖ్యలు
  • వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారీగా ఉద్యోగులను నియమించుకోనున్న క్యాప్ జెమినీ
  • ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనను కొట్టిపారేసిన వైనం
  • సరైన నైపుణ్యాలతో ఉద్యోగం లభించడం కష్టమేమీ కాదని వ్యాఖ్య
Capgemini recruitmnet in the 2024 25 financial year

టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపులు అధికమవుతున్న వేళ ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్ జెమినీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారీగా తాము ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నట్టు సంస్థ చీఫ్ టెక్నాలజీ, ఇన్నోవేటివ్ అధికారి నిషీద్ శ్రీవాస్తవ తెలిపారు. పెరుగుతున్న వ్యాపారానికి తగినట్టు నియామకాలు చేపడుతున్నట్టు వివరించారు. అయితే, పరిశ్రమ స్థాయిలోనే తమ ఉద్యోగుల సంఖ్య పెరుగుదల ఉంటుందని చెప్పారు. 

విద్యార్థుల్లో పరిశ్రమకు తగిన నైపుణ్యాలపై కూడా ఆయన స్పందించారు. దేశీయ ఐటీ అవసరాలకు, సాంకేతిక  విద్యలో నేర్పుతున్న పాఠ్యాంశాల మధ్య భారీ అంతరం ఉందని శ్రీవాస్తవ చెప్పారు. పరిశ్రమ ప్రమాణాల్లో కేవలం 1 శాతానికి మాత్రమే విద్యాసంస్థలు చేరుకుంటున్నాయని విచారం వ్యక్తం చేశారు. 

జనరేటివ్ ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనను ఆయన కొట్టి పారేశారు. అన్ని వయసుల వారూ కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరాన్ని ఇది పెంచుతుందన్నారు. డేటా, మెషీన్ లెర్నింగ్, ఏఐ, అనలిటిక్స్ వంటి సాంకేతికతల్లో నైపుణ్యాలు మెరుగు పరుచుకుంటే ఉద్యోగాలు తేలికేనని చెప్పారు.

More Telugu News