Telugu Students: మహాబలిపురం వద్ద సముద్రంలో ముగ్గురు తెలుగు విద్యార్థుల గల్లంతు

Telugu students missed in Mahabalipuram beach
  • తమిళనాడు పర్యటనకు వెళ్లిన పలమనేరు కాలేజీ విద్యార్థులు
  • సముద్రంలో ఈతకు దిగిన వైనం
  • గల్లంతైన వారి కోసం గాలిస్తున్న గజ ఈతగాళ్లు
తమిళనాడులోని మహాబలిపురంలో విషాదం నెలకొంది. ముగ్గురు తెలుగు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ ముగ్గురూ చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు కావడం గమనార్హం. కాలేజీ తరపున 18 మంది విద్యార్థుల బృందం తమిళనాడు టూర్ కి వెళ్లింది. మహాబలిపురంలో సరదాగా ఈత కోసం విద్యార్థులు సముద్రంలోకి దిగారు. ఈ సందర్భంగా విజయ్, ప్రభు, మౌనిష్ అనే విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థుల కోసం గజ ఈతగాళ్లు ప్రయత్నిస్తున్నారు. గల్లంతైన విద్యార్థుల్లో విజయ్ ది సదుం, ప్రభుది పులిచర్ల, మౌనిష్ ది బంగారుపాలెం అని తెలుస్తోంది. గల్లంతు సమాచారంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Telugu Students
Tamil Nadu
Mahabalipuram

More Telugu News