polio drops: రేపు ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల కార్యక్రమం

Polio drops to under 5 year old children
  • 0-5 సంవత్సరాల పిల్లలందరికీ అన్ని ఆరోగ్య కేంద్రాల్లో పోలియో చుక్కలు
  • తెలంగాణలో మూడు రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమం
  • చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని ఎక్కడికక్కడ అవగాహన కల్పిస్తున్న అధికారులు
పోలియో వ్యాధి నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రేపు అనగా మార్చి 3వ తేదీ ఆదివారం రోజున దేశవ్యాప్తంగా 0 - 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించనుంది. సమీపంలోని ఆరోగ్య కేంద్రం లేదా పోలియో కేంద్రం వద్ద మీ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి.

తెలంగాణలో మూడు రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమం

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, అంగన్‌వాడి కేంద్రాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయిదేళ్ల లోపు చిన్నారులకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు సూచించారు.

పల్స్ పోలియో చుక్కలు వేసే విషయంలో నిర్లక్ష్యం వద్దని పోలియో నివారణ రాష్ట్ర అధికారి డాక్టర్ అజార్ వైద్య సిబ్బందికి సూచించారు. పోలియో చుక్కల విషయంలో ఏ ఒక్క ఇంటినీ విస్మరించకూడదని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది తమకు అప్పగించిన గ్రామాలు, వార్డులలోని ఇళ్లలో తిరుగుతూ చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలన్నారు.
polio drops
Telangana
Polio Immunisation Drive
Pulse Polio

More Telugu News