Asaram Bapu: వివాదాస్పద స్వామీజీ ఆశారాం పిటిషన్ తిరస్కరణ.. శిక్ష నిలుపుదల కుదరదన్న సుప్రీంకోర్టు

Supreme Court refuses Asaram Bapu plea for suspension of sentence
  • 16 ఏళ్ల బాలికపై లైంగికదాడి కేసులో జీవిత శిక్ష అనుభవిస్తున్న ఆశారాం
  • అనారోగ్యం బారినపడడంతో శిక్ష నిలిపివేయాలంటూ పిటిషన్
  • చికిత్స కోసం కావాలంటే రాజస్థాన్ హైకోర్టుకు వెళ్లాలని సూచన

జోధ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న వివాదాస్పద స్వామీజీ ఆశారాం బాపుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన ఆరోగ్యం క్షీణిస్తున్నందున శిక్ష నిలిపివేయాలని కోరుతూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఆశారాం పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, పోలీసు కస్టడీలో మహారాష్ట్రలో చికిత్స తీసుకునేందుకు ఆయనను అనుమతించాలంటూ ఆయన తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఆశారాం అభ్యర్థనను తిరస్కరించింది. చికిత్స కోసం మాత్రం రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. కాగా, సూరత్‌లోని తన మరో ఆశ్రమంలోనూ మహిళపై లైంగికదాడి చేసిన కేసులోనూ ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది.

  • Loading...

More Telugu News