నిమిషం నిబంధన ఎత్తివేస్తూ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
- తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు ఊరట
- పరీక్ష హాలుకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించాలని నిర్ణయం
- విద్యాశాఖ అధికారులకు ఇంటర్ బోర్డు ఆదేశాలు
ఉదయం తొమ్మిది గంటల లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని గతంలో ఇంటర్ బోర్డు పేర్కొంది. తాజాగా 9 గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.