Satya Kumar: జగన్ కు ఓటు వేయొద్దని సొంత బాబాయ్ కూతురే చెపుతోంది: బీజేపీ నేత సత్యకుమార్

Satya Kumar comments on Jagan
  • వైఎస్ సునీతకే జగన్ న్యాయం చేయలేదన్న సత్యకుమార్
  • వివేకా హత్య కేసులో మీ పాత్రపై విచారణ జరపాలని సునీత అంటున్నారని వ్యాఖ్య
  • మీపై మీ కుటుంబానికి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోందని ఎద్దేవా

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ నేత సత్యకుమార్ మరోసారి విమర్శలు గుప్పించారు. మాట్లాడితే చాలు అక్కాచెల్లెమ్మలు అంటూ జగన్ ఊదరగొట్టేస్తుంటారని... కానీ, సొంత బాబాయ్ కూతురు సునీతకే న్యాయం చేయలేకపోయారని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడుస్తున్నా వివేకాను హత్య చేసింది ఎవరో తేల్చలేకపోయారని చెప్పారు. వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డుపెట్టుకుని, దర్యాప్తు సంస్థల విచారణను కూడా అడ్డుకుంటూ, నిందితులను కాపాడుతున్నారని దుయ్యబట్టారు. 

మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే కష్టాలు మరింత పెరుగుతాయని... ఆ పార్టీకి ఓటు వేయవద్దని మీ చెల్లెలు సునీతే చెపుతున్నారంటే... రాష్ట్రానికి మీరు ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో మీ పాత్రపై కూడా విచారణ చేయాలని ఆమె అడుగుతున్నారంటే... మీపై మీ కుటుంబానికి ఉన్న విలువ, నమ్మకం ఎంతో అందరికీ అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News