Daggubati Purandeswari: పవన్ ఎవరితో తిట్లు తిన్నారో ఆయనే చెప్పాలి: పురందేశ్వరి

  • అమరావతిలో రేపు, ఎల్లుండి బీజేపీ ముఖ్య నేతల సమావేశాలు
  • ఈ సమావేశాల్లో పొత్తులపై చర్చించే అవకాశం
  • ఏపీలో పొత్తులను తమ అగ్రనాయకత్వం నిర్ణయిస్తుందన్న పురందేశ్వరి
Purandeswari talks about Pawan Kalyan statements

అమరావతిలో మార్చి 2, 3 తేదీల్లో బీజేపీ ముఖ్య నేతల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ సహ సంఘటన్ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ హాజరు కానున్నారు. ఈ సమావేశాలకు రావాల్సిందిగా బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ నేతలకు, జిల్లా ముఖ్య నేతలకు ఆహ్వానాలు వెళ్లాయి. ఈ సమావేశాల్లో పొత్తులపై చర్చించే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో ఏపీలో బీజేపీ పొత్తులపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిని మీడియా పలకరించింది. పొత్తులకు సంబంధించి పవన్ కల్యాణ్ అధిష్ఠానం అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు... ఆయన పదేపదే అధిష్ఠానం అని అంటున్నారు? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఈ ప్రశ్న పవన్ కల్యాణ్ నే అడగాలని పురందేశ్వరి బదులిచ్చారు. అధిష్ఠానం అని చెప్పింది... అలాంటప్పుడు నన్ను ఎలా అడుగుతారు? అని తిరిగి ప్రశ్నించారు.

'పై నుంచి తిట్లు తింటున్నాను' అని కూడా పవన్ కల్యాణ్ చెబుతున్నారు... దీనిపై మీరేమంటారు? అని ఆ మీడియా ప్రతినిధి మరోసారి పురందేశ్వరిని అడిగారు. అందుకు పురందేశ్వరి స్పందిస్తూ... 'దానికి కూడా వివరణ ఆయనే ఇవ్వాలి... నేను కాదు' అని స్పష్టం చేశారు. 

ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుందా?... బీజేపీ-జనసేన-టీడీపీ పొత్తు ఏర్పడే అవకాశాలు ఉన్నాయా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా... పొత్తులను తమ అగ్రనాయకత్వం డిసైడ్ చేస్తుందని పురందేశ్వరి పునరుద్ఘాటించారు.

More Telugu News