Prathipati Pulla Rao: నా కుమారుడు శరత్ ను 16 గంటల పాటు తిప్పుతూనే ఉన్నారు: ప్రత్తిపాటి

Prathipati Pullarao reacts on his son arrest
  • పన్ను ఎగవేత కేసులో ప్రత్తిపాటి కుమారుడు శరత్ అరెస్ట్
  • తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా అరెస్ట్ లకు పాల్పడుతున్నారన్న ప్రత్తిపాటి
  • ఇలాంటి బెదిరింపులకు తాను భయపడబోనని స్పష్టీకరణ 
టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్ ను పన్ను ఎగవేత కేసులో నిన్న అరెస్ట్ చేయడం తెలిసిందే. కుమారుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో స్పందించారు. 

రాజకీయంగా ప్రజాక్షేత్రంలో తనను ఎదుర్కోవడం చేతకాక ఇలా అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. నా కుమారుడ్ని అరెస్ట్ చేయడం ద్వారా నైతికంగా నన్ను దెబ్బతీయాలనేది వారి కుట్ర అని వివరించారు. 

నిన్న తన కుమారుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు 16 గంటల పాటు తిప్పుతూనే ఉన్నారని ప్రత్తిపాటి ఆరోపించారు. ఓడిపోయే సమయంలోనూ జగన్ విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారని... ఇలాంటి బెదిరింపులకు తాను భయపడబోనని స్పష్టం చేశారు. తాను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నానని తెలిపారు. అరాచకాలు, అకృత్యాలను నమ్ముకున్న జగన్ వాటికే బలవుతాడని అన్నారు.
Prathipati Pulla Rao
Sarath
Arrest
TDP
Vijayawada

More Telugu News