Kodali Nani: చంద్రబాబుకు కాపు సామాజికవర్గం షాక్ ఇస్తుంది: కొడాలి నాని

Kapus will give shock to Chandrababu says Kodali Nani
  • పవన్ ను చంద్రబాబు నాశనం చేస్తున్నారన్న కొడాలి నాని
  • సొంత సామాజికవర్గానికి చంద్రబాబు 21 సీట్లు ఇచ్చారని విమర్శ
  • జగన్ ను పవన్ దారుణంగా తిడుతున్నారని మండిపాటు

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి విమర్శలు గుప్పించారు. ఇద్దరూ కలిసి ఏం చేస్తారో కూడా చెప్పకుండా జెండా సభలు పెట్టుకుంటున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాపు సామాజికవర్గం చంద్రబాబుకు బుద్ధి చెపుతుందని అన్నారు. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు నాశనం చేస్తున్నారని... చంద్రబాబు తిరిగి లేవకుండా 80 లక్షల కాపుల పాదాలు పాతాళానికి తొక్కుతాయని చెప్పారు. 

చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ను పవన్ చదువుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన సొంత సామాజికవర్గానికి 21 సీట్లు కేటాయించారని... రానున్న రోజుల్లో మరో 10 సీట్లు ఇస్తారని చెప్పారు. 3 శాతం ఉన్న కమ్మ సామాజికవర్గానికి 31 సీట్లు ఇచ్చినప్పుడు... 20 శాతం ఓటింగ్ ఉందని చెప్పుకుంటున్న జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలని ప్రశ్నించారు. 

చంద్రబాబు ఇచ్చిన 24 సీట్లతో తాము సంతృప్తిగా లేమని జనసైనికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారని కొడాలి నాని చెప్పారు. చంద్రబాబు, పవన్ చేతిలో మోసపోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. సీఎం జగన్ ను పవన్ దారుణంగా తిడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను చెపుతూ... 175 స్థానాల్లో అభ్యర్థులను జగన్ నిలబెడుతున్నారని కితాబునిచ్చారు.

  • Loading...

More Telugu News