Stay Order: ఆరు నెలల తర్వాత స్టే ఆర్డర్ ఆటోమెటిక్ రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

SC Constitution bench strikes down automatic vacation of stay after expiry of 6 months
  • ఆరు నెలల తర్వాత స్టే ఆర్డర్ ఆటోమెటిక్‌గా రద్దవుతుందని 2018లో త్రిసభ్య ధర్మాసనం తీర్పు
  • ఆ తీర్పుతో తాము ఏకీభవించబోమన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం
  • స్టే ఆర్డర్ ఆటోమెటిక్‌గా రద్దు కాదని స్పష్టీకరణ
  • సుప్రీంకోర్టు ఇచ్చే ఆర్డర్‌కు మాత్రం ఇది వర్తించదన్న సర్వోన్నత న్యాయస్థానం
స్టే ఆర్డర్ రద్దుపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సివిల్, క్రిమినల్ కేసుల్లో ఇచ్చే స్టే ఆర్డర్‌ను కోర్టు పొడిగిస్తే తప్ప ఆరు నెలల తర్వాత ఆటోమెటిక్‌గా రద్దు అయిపోతుందంటూ 2018లో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది. స్టే ఆటోమెటిక్‌గా రద్దు కాదని స్పష్టం చేసింది. 

ఏషియన్ రీసర్ఫేసింగ్ ఆఫ్ రోడ్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఏఎన్ఆర్-సీబీఐ కేసులో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో తాము ఏకీభవించబోమని రాజ్యాంగ ధర్మాసనం బెంచ్‌లో ఒకరైన జస్టిస్ ఓకా తెలిపారు. కేసులు ఏ కోర్టులో పెండింగ్‌లో ఉన్నా వాటిని కొట్టివేసేందుకు రాజ్యాంగ కోర్టులు సాధారణంగా కాలపరిమితి విధించకూడదని బెంచ్ పేర్కొంది. ఆయా కోర్టుల్లో ఉన్న కేసుల గురించి క్షేత్రస్థాయిలో ఆయా న్యాయస్థానాల న్యాయమూర్తులకే తెలుస్తుందని పేర్కొంది. అయితే, సుప్రీంకోర్టు ఇచ్చే ఆర్డర్‌కు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది.
Stay Order
Supreme Court
Constitutional Courts
Chief Justice of India D Y Chandrachud

More Telugu News