Deepika Padukone: తల్లి కాబోతున్న దీపికా పదుకొణే

Deepika Padukone and Ranveer Singh announce pregnancy
  • ఇన్స్టా ద్వారా విషయాన్ని వెల్లడించిన దీపిక, రణవీర్
  • సెప్టెంబర్ లో డెలివరీ కాబోతున్నట్టు వెల్లడి
  • 2018లో ప్రేమ వివాహం చేసుకున్న దీపిక, రణవీర్

బాలీవుడ్ దంపతులు దీపికా పదుకొణే, రణవీర్ సింగ్ లు తల్లిదండ్రులు కాబోతున్నారు. దీపిక త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని దీపిక, రణవీర్ ఈ విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబర్ లో డెలివరీ కాబోతున్నట్టు వారు వెల్లడించారు. తల్లిదండ్రులు కాబోతున్న దీపిక, రణవీర్ లకు సెలబ్రిటీలు, నెటిజెన్లు శుభాకాంక్షలు చెపుతున్నారు. 

2013లో వచ్చిన 'రామ్ లీలా' సినిమా టైమ్ లో దీపిక, రణవీర్ ప్రేమలో పడ్డారు. 2018లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. కెరీర్ పరంగా ఇద్దరూ చాలా బిజీగా ఉంటున్నప్పటికీ... అది తమ కుటుంబ జీవితంపై పడకుండా, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంతోషకర జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపిక మాట్లాడుతూ... తనకు, రణవీర్ కు పిల్లలంటే చాలా ఇష్టమని చెప్పారు. పిల్లలతో తమ కుటుంబాన్ని పరిపూర్ణం చేసుకునే ఆ క్షణం కోసం తాము ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని అన్నారు. తమ పిల్లల్ని సెలబ్రిటీ స్టేటస్ తో సంబంధం లేకుండా సాధారణంగానే పెంచాలనుకుంటున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News