Team India: టీమిండియా ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ

BCCI announces annual contracts for Team India cricketers
  • శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లపై వేటు
  • ఇద్దరినీ కాంట్రాక్టు జాబితా నుంచి తప్పించిన బీసీసీఐ
  • పలువురు యువ ఆటగాళ్లకు కాంట్రాక్టు 
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమిండియా ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్టులు ప్రకటించింది. తమ మాట వినని శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లను కాంట్రాక్టు విధానం నుంచి తప్పించింది. 

జాతీయ జట్టుకు ఆడనప్పుడు దేశవాళీ క్రికెట్లో ఆడాలన్న బీసీసీఐ సూచనను శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ పెడచెవిన పెట్టారు. రంజీ మ్యాచ్ లో ఆడకపోగా, ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేశారు. అందుకు మూల్యం చెల్లించారు. వారిద్దరిపై కాంట్రాక్టుల్లో వేటు పడింది. అసలే గ్రేడ్ లోనూ వారిద్దరి పేర్లను చేర్చకుండా బోర్డు తన తడాఖా చూపింది. 

ఇక, మహ్మద్ సిరాజ్, శుభ్ మాన్ గిల్, కేఎల్ రాహుల్ ఏ గ్రేడ్ కు ప్రమోషన్ పొందారు. ఏ ప్లస్ గ్రేడ్ లో కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు.  

ఏ ప్లస్ గ్రేడ్: రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా
ఏ గ్రేడ్: కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్యా, శుభ్ మాన్ గిల్, 
బి గ్రేడ్: కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్.
సి గ్రేడ్: తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, అవేష్ ఖాన్, కేఎస్ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అర్షదీప్ సింగ్, ముఖేశ్ కుమార్, శివమ్ దూబే, జితేశ్ శర్మ, రవి బిష్ణోయ్.
ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్: ఉమ్రాన్ మాలిక్, ఆకాశ్ దీప్, విద్వంత్ కావేరప్ప, విజయ్ కుమార్, యశ్ దయాళ్. 

ఈ కాంట్రాక్టులను 2023 అక్టోబరు 1 నుంచి వర్తింపజేయనున్నారు. ఈ కాంట్రాక్టులు 2024 సెప్టెంబరు 30 వరకు అమల్లో ఉంటాయి.
Team India
Contracts
BCCI

More Telugu News