Train Accident: ఝార్ఖండ్‌లో ట్రాక్ దాటుతుండగా ఢీకొట్టిన రైలు... 12 మంది మృతి

Several dead as train runs over passangers
  • రైలు ఢీకొనడంతో 12 మంది మృతి
  • జాంతారలోని కాలా ఝరియా రైల్వే స్టేషన్ వద్ద దుర్ఘటన
  • ప్రమాదం విషయం తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లు

ఝార్ఖండ్‌లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో 12 మంది మృతి చెందిన విషాద సంఘటన చోటు చేసుకుంది. జాంతారలోని కాలా ఝరియా రైల్వే స్టేషన్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ప్రాథమికంగా పన్నెండు మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అధికారులు దీనిని ధ్రువీకరించాల్సి ఉంది.

ప్రమాదం విషయం తెలియగానే వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. కొంతమంది రైల్వే ట్రాక్ దాటుతుండగా అంగా ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. పన్నెండు మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News