జనసేన జెండా చేతబట్టిన చంద్రబాబు... టీడీపీ జెండా ఊపిన పవన్
- తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభ
- హాజరైన చంద్రబాబు, పవన్
- పార్టీ జెండాలు ఊపి శ్రేణుల్లో ఉత్సాహం కలిగించిన నేతలు
పార్టీ జెండాలు ఊపి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. పరస్పరం జెండాలు మార్చుకుని తమ మైత్రిని ప్రదర్శించారు. చంద్రబాబు జనసేన జెండా చేతబట్టగా, పవన్ కల్యాణ్ టీడీపీ జెండా అందుకుని ఊపారు. ఈ సందర్భంగా సభా వేదికపై పెద్ద సంఖ్యలో ఉన్న టీడీపీ, జనసేన నేతలతో చంద్రబాబు, పవన్ కరచాలనం చేశారు. చేయి చేయి కలిపి పైకెత్తి టీడీపీ, జనసేన ఐక్యతను చాటారు.