Balasouri: జనసేన - టీడీపీ సీట్ల సర్దుబాటులో కొన్ని చోట్ల అసంతృప్తులు నెలకొన్నాయి: బాలశౌరి

  • వైసీపీ పాలనలో అధర్మం నాలుగు పాదాల మీద నడుస్తోందన్న బాలశౌరి
  • వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వ్యాఖ్య
  • టీడీపీ - జనసేనలు ఘన విజయం సాధిస్తాయని ధీమా
Balasouri confident of  TDP and Janasena win

వైసీపీ నుంచి ఏపీ ప్రజలకు విముక్తి కలిగించాలనేదే తమ లక్ష్యమని ఎంపీ బాలశౌరి తెలిపారు. జనసేనాని పవన్ కల్యాణ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా అందరం కట్టుబడి ఉంటామని చెప్పారు. వైసీపీ పాలనలో న్యాయం, ధర్మం లేవని... అధర్మం నాలుగు పాదాల మీద నడుస్తోందని విమర్శించారు. జనసేన - టీడీపీ సీట్ల సర్దుబాటులో కొన్ని చోట్ల అసంతృప్తులు చోటు చేసుకున్నాయని, ఇవన్నీ సాధారణ అంశాలేనని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని చెప్పారు.     

వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని... టీడీపీ - జనసేన కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని బాలశౌరి ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును గత టీడీపీ ప్రభుత్వం 70 శాతం పూర్తి చేసిందని... వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏమీ చేయలేదని విమర్శించారు. మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ ప్రాజెక్టు దివిసీమ ప్రాంతానికి తీరని కల అని... దాన్ని నిజం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. మచిలీపట్నం నియోజకవర్గంలో జాతీయ రహదారుల అభివృద్దిపై దృష్టి సారించామని తెలిపారు.

More Telugu News