Chandrababu: భువనేశ్వరీ... అరకు కాఫీ ఎలా ఉంది?: చంద్రబాబు ఆసక్తికర ట్వీట్

Chandrababu asks wife Nara Bhuvaneswari how is Araku Coffee
  • ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర
  • అరకు నియోజకవర్గంలో పర్యటన
  • గిరిజన కాఫీ రుచి చూసిన భువనేశ్వరి
  • ఫొటో పంచుకున్న చంద్రబాబు 
టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి యాత్ర చేపడుతున్నారు. ఈ ఉదయం నారా భువనేశ్వరి అరకు ప్రాంతంలో పర్యటించారు. అరకులో గిరిజనులు సాగు చేస్తున్న కాఫీని రుచి చూశారు. 

దీనిపై చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. అరకు గోల్డ్ కాఫీ వద్ద కాఫీ తాగుతున్న భువనేశ్వరి ఫొటోను పోస్టు చేశారు. "భువనేశ్వరీ... మన గిరిజన సోదర సోదరీమణులు ఉత్పత్తి చేస్తున్న కాఫీ ఎలా ఉంది?" అని సరదాగా ప్రశ్నించారు. 

స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి నేడు అరకు వచ్చారు. అరకు నియోజకవర్గం ముసురుగూడ గ్రామంలో మరణించిన టీడీపీ కార్యకర్త సొన్నాయి బసు కుటుంబాన్ని పరామర్శించి, రూ.3 లక్షల ఆర్థికసాయం అందించారు.
Chandrababu
Nara Bhuvaneswari
Araku Coffee
Nijam Gelavali Yatra
TDP

More Telugu News