Mahesh Babu: ఇలాంటి ప్రశ్నలు నా మదిలో మెదులుతూనే ఉన్నాయి: మహేశ్ బాబు

Mahesh Babu complements to Poacher series
  • 'పోచర్' వెబ్ సిరీస్ పై ప్రశంసలు కురిపించిన మహేశ్
  • వెబ్ సిరీస్ ను ప్రోడ్యూస్ చేసిన అలియా భట్
  • కేరళ అడవుల్లో ఏనుగులను వేటాడే రాకెట్ చుట్టూ కథ

తనకు ఏదైనా సినిమా కానీ, వెబ్ సిరీస్ కానీ నచ్చితే దాన్ని మెచ్చుకుంటూ మహేశ్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ 'పోచర్' అనే వెబ్ సిరీస్ ను ప్రొడ్యూస్ చేసింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కేరళ అడవుల్లో ఏనుగులను వేటాడే రాకెట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సిరీస్ కు 'ఢిల్లీ క్రైమ్' ఫేమ్ డైరెక్టర్ రిచీ మెహతా ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ను చూసిన మహేశ్ బాబు ప్రశంసలు  కురిపించారు. 

'ఎవరైనా ఇలా ఎలా చేయగలరు? మానవత్వం లేదా? వాళ్ల చేతులు వణకలేదా? క్రైమ్ థ్రిల్లర్ 'పోచర్' వెబ్ సిరీస్ ను చూసిన తర్వాత ఇలాంటి ప్రశ్నలు నా మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఏనుగులను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది' అని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 

www.instagram.com/p/C32P6LKsizz/?utm_source=ig_web_copy_link
  • Loading...

More Telugu News