Dastagiri: చైతన్యరెడ్డి ఓ డాక్టర్ లాగా జైల్లోకి వచ్చాడు... రూ.20 కోట్లు ఆఫర్ చేశారు: దస్తగిరి

Dastagiri makes sensational allegations
  • వైసీపీ ప్రభుత్వం తనను భయభ్రాంతులకు గురిచేస్తోందన్న దస్తగిరి
  • తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆందోళన
  • తనను ప్రలోభాలకు గురిచేస్తున్నారని వెల్లడి

వైసీపీ ప్రభుత్వం తనను భయభ్రాంతులకు గురిచేసేందుకు కుట్ర పన్నిందని వివేకా హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఆరోపించాడు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డిల పేర్లను దస్తగిరి ప్రస్తావించాడు. 

"సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ తనను కొట్టారని, తనపై ఒత్తిడి తెచ్చి అనేక విషయాలు చెప్పిస్తున్నారని వివేకా పీఏ కృష్ణారెడ్డి ఎలా ఆరోపణలు చేశాడో, నన్ను కూడా అలాగే చెప్పమని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. 

ఇది రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న కేసు అంట... జగన్ కు వివేకా చిన్నాన్న అయినందున ఆయనకు ఎఫెక్ట్ ఎక్కువ ఉందంట... ఓట్లు పడని పరిస్థితి అంట... అందుకే నాకు డబ్బు ఆఫర్ చేశారు. ప్రస్తుతానికి రూ.20 కోట్లు అడ్వాన్స్ గా ఉంచుకో అన్నారు.

దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్యరెడ్డి ఓ డాక్టర్ లా జైలులో పేషెంట్లను చూడ్డానికి వచ్చాడు. అతడు జైల్లో నన్ను పూర్తిస్థాయిలో ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశాడు" అని వివరించారు. ఇవాళ  ఓ వారెంట్ విషయంలో నాంపల్లి కోర్టుకు హాజరైన దస్తగిరి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

  • Loading...

More Telugu News