1st Class: ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతిలో అడ్మిషన్: కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు

6 years age is compulsory for 1st class joining kids
  • నిబంధనలు రూపొందించాలంటూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు
  • ఒకటో తరగతిలో చేరే పిల్లలకు ఆరేళ్లు తప్పనిసరి అన్న కేంద్రం
  • నూతన విద్యా విధానం ప్రకారం నిర్ణయం తీసుకున్నామన్న కేంద్రం

చిన్నారులకు ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతిలో అడ్మిషన్లు వచ్చేలా కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిబంధనలు రూపొందించాలంటూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలను జారీ చేస్తూ లేఖలు రాసింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద ఒకటో తరగతిలో చేరే పిల్లలకు ఆరేళ్ల వయసు తప్పనిసరి అని పేర్కొంది. నూతన విద్యా విధానం, విద్యా హక్కు చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News