జగన్ అధ్యక్షతన కొనసాగుతున్న కీలక భేటీ.. 'మేము సిద్ధం.. మా బూత్ సిద్ధం' పేరుతో సమావేశం
- 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యం
- పార్టీ నేతలను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్న జగన్
- సమావేశానికి హాజరైన 175 నియోజకవర్గాలకు చెందిన నేతలు
ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, రీజనర్ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, జగనన్న సచివాలయ కన్వీనర్లు హాజరయ్యారు. వచ్చే నెల 3వ తేదీన పల్నాడులోని పిచ్చికలపాడులో 'సిద్ధం' చివరి సభను నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి జగన్ శ్రీకారం చుడతారు. ఇప్పటి వరకు భీమిలి, దెందులూరు, రాప్తాడులలో మూడు 'సిద్ధం' సభలను నిర్వహించారు.