Atchannaidu: వైసీపీని ఓటమి భయం వెంటాడుతోంది: అచ్చెన్నాయుడు

YSRCP is haunted by the fear of defeat says Atchannaidu
  • ఓటమి భయంతో దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారన్న అచ్చెన్న
  • పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని మండిపాటు
  • జగన్ ఇంటికి పోవడం ఖాయమని వ్యాఖ్య
వైసీపీని ఓటమి భయం వెంటాడుతోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఓటమి భయంతోనే దౌర్జన్యాలకు, దాడులకు తెగబడుతోందని విమర్శించారు. పోలీసులు కూడా అధికార పార్టీకి కొమ్ముకాస్తూ, వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల ముందే వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. 

వైసీపీ పాలనలో మీడియాకు, పత్రికలకు, జర్నలిస్టులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని అచ్చెన్న ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అక్రమ పాలనకు ముగింపు పలికే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. వైసీపీ పాలనలో రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారయిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించబోతోందని జోస్యం చెప్పారు. జగన్ ఇంటికి పోవడం ఖాయమని అన్నారు.
Atchannaidu
Telugudesam
Jagan
YSRCP
AP Politics

More Telugu News