ghazal singer: ప్రముఖ గజల్ సింగర్ పంకజ్ ఉధాస్ కన్నుమూత

Ghazal Singer Pankaj Udhas Passes Away At 73 After Prolonged Illness
  • అనారోగ్యం కారణంగా 72 ఏళ్ల వయస్సులో ఉధాస్ కన్నుమూత
  • కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న గజల్ సింగర్
  • హిందీతో పాటు పలు భాషల్లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన ఉధాస్

ప్రముఖ గజల్ సింగర్ పంకజ్ ఉధాస్ కన్నుమూశారు. 72 ఏళ్ల పంకజ్ కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ, ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుజరాత్‌కు చెందిన ఈ గజల్ గాయకుడికి 2006లో పద్మశ్రీ వచ్చింది. ఆయన హిందీతో పాటు పలు భాషల్లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు. ఆయన మరణవార్తను కూతురు నయాబ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. 'బరువైన హృదయంతో.. దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా ఫిబ్రవరి 26వ తేదీన పద్మశ్రీ పంకజ్‌ ఉధాస్‌ మరణించిన విషయం తెలియజేయడానికి చింతిస్తున్నాము' అని పోస్ట్ పెట్టారు.

  • Loading...

More Telugu News