Yarlagadda Venkatrao: నా ప్రత్యర్థి ఎవరో ఇంకా తెలియదు: గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు

Gannavaram TDP candidate Yarlagadda Venkatrao on his opponent
  • తొలి జాబితాలోనే టీడీపీ టికెట్ దక్కించుకున్నానన్న యార్లగడ్డ
  • ప్రస్తుతానికి తన ప్రత్యర్థి వైసీపీ అని వ్యాఖ్య
  • గన్నవరంలో దొంగ పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయిందని మండిపాటు
టీడీపీ తొలి జాబితాలో గన్నవరం టికెట్ ను యార్లగడ్డ వెంకట్రావు దక్కించుకున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ గన్నవరంలో దొంగ పట్టాలు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమయిందని మండిపడ్డారు. అర్హులైన నిరుపేదలకు పట్టాలు ఇస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే దొంగ పట్టాలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. దొంగ ఓట్ల గురించి ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఫేక్ ఓట్లను తొలగించకుంటే సంబంధిత అధికారులు దీనికి బాధ్యత వహించక తప్పదని అన్నారు. 

పోలీసులు పక్షపాతం లేకుండా విధులు నిర్వహించాలని వెంకట్రావు చెప్పారు. గన్నవరంలో టీడీపీ శ్రేణులపై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. పద్దతి మార్చుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారని హెచ్చరించారు. తొలి జాబితాలోనే తనకు టీడీపీ టికెట్ ప్రకటించారని... తన ప్రత్యర్థి ఎవరో తనకు తెలియదని... ప్రస్తుతానికైతే వైసీపీనే తన ప్రత్యర్థి అని వెంకట్రావు చెప్పారు.
Yarlagadda Venkatrao
Telugudesam
Gannavaram
YSRCP

More Telugu News