‘గామి’ ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటన
- ఫిబ్రవరి 29న విడుదల చేయనున్నట్టు యూవీ క్రియేషన్స్ ప్రకటన
- తొలిసారిగా పీసీఎక్స్ స్క్రీన్‌పై ట్రైలర్ విడుదల చేయబోతున్నామని వెల్లడి
- మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్టు గుర్తు చేసిన చిత్రయూనిట్
కాగా విష్వక్ సేన్ హీరోగా, చాందిని చౌదరి హీరోయిన్‌గా నటించిన ‘గామి’ సినిమాకి విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించాడు. కార్తీక్ శబరీష్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌కు సినీ ప్రియుల నుంచి చక్కటి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.