Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురి మృతి

Five dead in fatal road accident in Annamayya district
  • కర్ణాటక నుంచి మదనపల్లి వస్తున్న స్పార్పియో వాహనం
  • తొలుత ఇద్దరు పాడి రైతులను ఢీకొట్టిన వైనం
  • అక్కడికక్కడే మృతి చెందిన రైతులు 
  • అనంతరం ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టిన స్పార్పియో
  • స్పార్పియోలోని ముగ్గురు వ్యక్తుల దుర్మరణం

అన్నమయ్య జిల్లాలో మదనపల్లి-బెంగళూరు జాతీయ రహదారి నెత్తురోడింది. ఐదుగురు మృత్యువాత పడ్డారు. వేగంగా వెళుతున్న స్పార్పియో వాహనం తొలుత చంద్ర, సుబ్రహ్మణం అనే ఇద్దరు పాడి రైతులను ఢీకొట్టింది. దాంతో ఆ రైతులు ఇద్దరూ ఘటన స్థలంలోనే మరణించారు. అనంతరం స్పార్పియో వాహనం... ఎదురుగా వస్తున్న ఓ లారీని ఢీకొట్టింది. దాంతో స్పార్పియోలోని ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. 

మదనపల్లి మండలం బార్లపల్లె వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్పార్పియో వాహనంలో మృతి చెందిన వ్యక్తులను విక్రమ్, శ్రీను, తిలక్ గా గుర్తించారు. స్పార్పియో వాహనం కర్ణాటక నుంచి మదనపల్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

స్పార్పియోలోని ఇద్దరు వ్యక్తులకు గాయాలు కాగా, వారిని మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. కాగా, స్పార్పియో డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News